Friday, November 22, 2024

1983 వరల్డ్ కప్ ఆటగాడు యశ్‌పాల్ శర్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Yashpal Sharma dies of heart attack at 66

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ (66) కన్నుమూశారు. మంగళవారం 7.40 సమయంలో గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున ఆడారు. భారత్ తరపున 37 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 8933 పరుగులు చేశాడు. 1979  లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్‌పై అరంగ్రేటం చేయగా 1983లో టెస్టుల నుంచి వైదొలిగాడు. టెస్టులో 1606 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు. 1978లో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి మ్యాచ్ ఆడాడు.  వన్డేల్లో 883 పరుగులు చేశాడు. 1985లో ఛండీగఢ్‌లో ఇంగ్లాండ్‌పై చివరి వన్డే ఆడాడు. 1954 ఆగష్టు 11న లూధియానాలో జన్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News