ఏడాదిన్నరగా రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు హీరో యష్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. యష్, ప్రముఖ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా టైటిల్‌ను ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అని ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులోని విజువల్స్, మూవీ స్కేల్, పర్‌ఫెక్షన్ కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ మాట్లాడుతూ “రాకింగ్ స్టార్ యష్‌తో సినిమా చేయబోతుండటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఇది మాకెంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. యష్, గీతూ బలమైన కథనంతో మాస్, యాక్షన్ అంశాలను కలగలిపిన కథను తయారు చేయడానికి సమయం తీసుకున్నారు.
ఈ అద్భుతమైన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని అన్నారు. దర్శకుడు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ.. “కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడు ప్రయోగాలు చేస్తుంటాను. ఇక యష్ ఒక అద్భుతమైన వ్యక్తి. అతనితో కలిసి ఈ మ్యాజికల్ జర్నీని చేయడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను”అని పేర్కొన్నారు. యష్ మాట్లాడుతూ.. “ కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10, 2025న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారు” అని తెలిపారు.