Monday, December 23, 2024

యశ్వంత్ సిన్హా పూర్వాపరాలు

- Advertisement -
- Advertisement -

Yashwant sinha biography in telugu

హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు.  బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో 1937 నవంబర్ 6న కాయస్థ కుటుంబంలో జన్మించారు. సిన్హా కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం 1960 వరకు పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.  1960 లోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) కి ఎంపికయ్యారు.
24 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. బీహార్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలో సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ పదవికి నియమించబడ్డారు. 1971 నుంచి 1974 వరకు జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి మొదటి కార్యదర్శిగా నియమించబడ్డారు. 1984 లో తన పదవికి రాజీనామా చేసారు.

రాజకీయ ప్రస్థానం:

1986 లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు
1988లో మొదటిసారిగా జనతా పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు
1989లో జనతాదల్ తో పొత్తు తర్వాత, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు
1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు
1992 లో బిజెపి పార్టీలో చేరి, అనంతరం కాలంలో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు
1996 లో లోక్ సభకు ఎన్నికయ్యారు
1998 లో వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు
2002 లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు
2009 లో మళ్లీ హజరీబాగ్ నుంచి ఎంపీగా గెలిచారు
2009లో బిజెపి ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు
2018 లో బిజెపిని వీడారు.
2021 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News