- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ దేశం ప్రమాదంలో ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై ఎవరిలోనూ చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో యశ్వంత్ ఆర్థిక మంత్రిగా భాద్యతలు చేపట్టారు. 1960 బ్యాచ్ మాజీ ఐఎఎస్ అధికారి అయిన సిన్హా 1984 లో రాజకీయాల్లో చేరారు. ప్రభుత్వ సేవను విడిచిపెట్టి జనతా పార్టీని ప్రారంభించారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. అతని కుమారుడు జయంత్ సిన్హా బిజెపి నుండి హజారిబాగ్ (జార్ఖండ్) నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
Yashwant Sinha Joins Trinamool Congress
- Advertisement -