Monday, December 23, 2024

రాష్ట్రపతి ఎన్నిక.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

- Advertisement -
- Advertisement -

Yashwant Sinha selected as joint Opposition candidate

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు జైరాం రమేష్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల 27 న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ నిర్వహిస్తారు. 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

యశ్వంత్ సిన్హా రాజకీయ నేపథ్యం
1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా జనతా పార్టీలో చేరారు. 1988 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 లో భారతీయ జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 1998,1999.2009లో జార్ఖండ్ లోని హజారీబాగ్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. 2002 లో వాజ్‌పాయ్ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ కేబినెట్‌లో ఏడాదిపాటు (1998) కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిన్హా బిజెపి నుంచి బయటకు వచ్చి గత ఏడాది తృణమూల్ పార్టీలో చేరారు. తృణమూల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ మంగళవారం ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌కు సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాజ్‌పాయ్ హయాంలో , మోడీ నేతృత్వ పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. ఆయన కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం బిజేపి లోనే కొనసాగుతుండటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News