Sunday, December 22, 2024

నేడు యశ్వంత్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

Yashwant Sinha to be nominated as opposition candidate tomorrow

టిఆర్‌ఎస్ తరఫున మంత్రి కెటిఆర్ హాజరు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికే ఖరారు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం (నేడు) తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సిన్హా ఇప్పుడు టిఎంసి నేతగా ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మమత బెనర్జీ, సీతారాం ఏచూరి, మల్లిఖార్జున ఖర్గే , శరద్ పవార్ ఇతర ప్రతిపక్ష నేతలు హాజరవుతారని వెల్లడైంది. కొందరు విపక్ష నేతలు రాష్ట్రపతి పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గాంధీజి మనవడు కూడా నిరాకరించారు. ఈ దశలో మమత బెనర్జీ చొరవతో సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా ఎంచుకున్నారు. నేడు కీలకమైన నామినేషన్ ఘట్టానికి ఆయన సిద్ధం అయ్యారు. అయితే ఎన్‌డిఎ అభ్యర్థి వైపే మొగ్గు కనబడుతోన్న దశలో దీనిపై సిన్హా స్పందించారు. ఇప్పుడు , పోలింగ్ తేదీ మధ్యలో తనకు కొన్ని అదృశ్య శక్తుల మద్దతు దక్కుతుందని , దీనిపై తాను వివరించదల్చుకోలేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి వైదొలిగే ప్రసక్తే ఉండదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News