Saturday, December 21, 2024

అటు బిజెపి హడావుడి ఇటు యశ్వంత్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

2న రాష్ట్రానికి రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి
టిఆర్‌ఎస్ నేతలతో ప్రత్యేక సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : విపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జూలై 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి మద్దతు మన రాష్ట్రం నుంచి కూడా గంపగుత్తగా ఆయనకే ఓట్లు పడనున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్….తెలంగాణకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, శాసనసభ్యులతో జరిగే ప్రత్యేక సమావేశంలో సిన్హా పాల్గొనున్నారు.

కాగా రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా….వాటిల్లో టిఆర్‌ఎస్ నుంచి తొమ్మిది, కాంగ్రెస్ నుంచి నాలుగు, బిజెపి నుంచి ముగ్గురు, మజ్లిస్ నుంచి ఒక్కరు కొనసాగుతున్నారు. ఇందులో బిజెపి మినహా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభలో మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా….మొత్తంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా…అందులో టిఆర్‌ఎస్ నుంచి 103 మంది, మజ్లిస్ నుంచి ఏడు, కాంగ్రెస్ నుంచి ఆరు, బిజెపి నుంచి ముగ్గురు శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ గణాంకాల (ఓటర్ల సంఖ్య) ప్రకారం యశ్వంత్ సిన్హాకు భారీగా ఓట్లు తెచ్చేపెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా అత్యంత కీలకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News