Monday, December 23, 2024

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేము: యశ్వంత్ సిన్హా

- Advertisement -
- Advertisement -

Yashwanth Sinha comments on Modi

హైదరాబాద్: టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నందకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీ ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సిఎం కెసిఆర్ సవివివరంగా చెప్పారని ప్రశంసించారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తు ఉండలేమన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటంగా అభివర్ణించారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిది కాదని హితువుపలికారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.  రాష్ట్రపతి ఎన్నిక తరువాత కూడా పోరాటం కొనసాగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News