Monday, December 23, 2024

హైదరాబాద్ కు చేరుకున్న యశ్వంత్ సిన్హా…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాకు  సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నేత విహెచ్ స్వాగతం పలికారు.  బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు టిఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. యశ్వంత్ సిన్హా భారీ ర్యాలీగా జలవిహార్ కు చేరుకున్నారు. జల విహార్ లో ఏర్పాటు చేసిన సభలో టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు పాల్గొంటారు. రోడ్డు మొత్తం టిఆర్ఎస్ జెండాలతో గులాబీమయంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News