- Advertisement -
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. రోహిత్ వంటి ఆటగాడిని ఉన్న ఫళంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం ముమ్మాటికి పెద్ద పొరపాటేనని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, ఇలాంటి స్థితిలో మరో సీజన్ పాటు అతన్నే కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ సారథ్యంలో ముంబై ఐదు సార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలిచిన విషయాన్ని యువరాజ్ గుర్తు చేశాడు. అలాంటి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముంబై యాజమాన్యం హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఎలాంటి తప్పులేదని, అయితే రోహిత్‌కు మరో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదనని యువరాజ్ వ్యాఖ్యానించాడు.
- Advertisement -