Thursday, January 23, 2025

బాలికపై వైసిపి కార్యాకర్త అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

Godman rapes woman in name Of rituals
అమరావతి: ఓ బాలికపై వైసిపి కార్యకర్త అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వైసిపి కార్యకర్త కానాల నరేందర్ రెడ్డి ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక దగ్గరకు వెళ్లాడు. బాలికపై అత్యాచారం చేస్తుండగా ఆమె కేకలు అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి రాగానే తల్లిదండ్రులకు బాలిక సమాచారం ఇవ్వడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే బాలికను గురుజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామమని పోలీసులు వెల్లడించారు. గతంలో నరేందర్ రెడ్డి అత్యాచారయత్నం కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News