Friday, November 22, 2024

అమరావతిలో బిజెపి నేతలపై వైకాపా కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో బిజెపి నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడిచేశారు. మదడంలో జరిగిన సభ తర్వాత తిరిగి విజయవాడకు వెళుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆ నేతలపై దాడి జరిగింది. వైకాపా నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. సత్యకుమార్ వాహనం అద్దాలను పగులగొట్టారు. కాగా పోలీసులు సత్యకుమార్‌ను అక్కడ నుంచి పంపించేశారు. పోలీసుల సాయంతో బిజెపి నేతలు బయటపడ్డారు.

మీడియాతో సత్యకుమార్ మాట్లాడుతూ వైకాపా వాళ్లకు భయపడబోమన్నారు. దాడి చేస్తే ప్రతిదాడి చేస్తామన్నారు. దాడి వెనుక ఉన్న సూత్రధారులపై డిజిపి చర్యలు తీసుకోవాలన్నారు. మందడంలో వేలాది మంది రైతులు దీక్ష చేస్తుంటే 10 మంది కూడా పోలీసులు లేరని, మూడు రాజధానులకు మద్దతుగా 10 మంది దీక్ష చేస్తుంటే వంద మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. ఓ పథకం ప్రకారమే ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారని సత్య కుమార్ ఆరోపించారు.

చంద్రబాబు స్పందన:
బిజెపి నేత సత్య కుమార్ వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడాన్ని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైకాపా మూకలు దాడి చేస్తున్నాయన్నారు. దాడి చేసే వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News