- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని భావోద్వేగాలతో రెచ్చగొట్టి టిడిపి, వైసిపిలు చలిమంటలు కాచుకుంటున్నాయని ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వివాదాస్పద అంశాలను రాజకీయాలు చేయాలనేది సిఎం ఆలోచని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీలను నిలదీసే బాధ్యత బిజెపి తీసుకుందన్నారు. రాజధానిపై మాట్లాడే అర్హత వైసిపి, టిడిపికి లేదన్నారు. దసపల్లా భూముల దందా తప్ప విశాఖకు ఏం చేశారో చెప్పాలని? నిలదీశారు.
- Advertisement -