Thursday, April 10, 2025

చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడటం సరికాదు: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఈ నెల 18న నీటి ప్రాజెక్టులపై కడపలో రాష్ట్ర సదస్సు జరుగుతుందని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థి అయితే మాత్రం నిర్లక్షంగా మాట్లాడటం సరికాదని, ఆరోగ్యం బాగాలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా? అని రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలిగానీ డిఐజి ఎలా మాట్లాడుతారని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News