Monday, December 23, 2024

వైసిపి నేతను లారీతో ఢీకొట్టి…

- Advertisement -
- Advertisement -

 

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం కునుమళ్ల గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని లారీతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ హత్య పాతకక్షల నేపథ్యంలో జరిగినట్టు సమాచారం. మృతుడు వైసిపి పార్టీకి చెందిన రవితేజగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మూలగుంటపాడులో పసుపులేటి రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. రవితేజ ఇసుక వ్యాపారం చేయడంతో పాటు వైసిపిలో చురుకుగా పని చేసేవాడు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో రవితేజ తన స్నేహితుడు ఉమతో కలిసి వేర్వేరు బైక్ లలో కనుమళ్లకు వస్తున్నారు. రవితేజను లారీ ఢీకొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్నేహితుడు ఉమ లారీని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతడి పైనుంచి వెళ్లేందుకు లారీ ప్రయత్నించడంతో రెప్పపాటులో తప్పించుకున్నాడు. వెంటనే ఉమ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసున నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదివి కోసం రవితేజకు మరో వ్యక్తి మధ్య వర్గ పోరు నడుస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం పాతకక్ష్యల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News