- Advertisement -
ఏలూరు: జిల్లాలో వైసిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం ద్వారకాతిరుమల మండలంలోని జికొత్తపల్లిలో వైసిపి గ్రామపార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న గంజి ప్రసాద్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దారుణంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
YCP Leader Murdered in Eluru
- Advertisement -