Monday, December 23, 2024

లోకేశ్ తో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ తో సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో ఆదిమూలం వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన తీవ్రంగా విభేదిస్తున్నారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా తిరుపతి ఎంపీ స్థానానికి ఇంచార్జిగా పెద్దిరెడ్డిని నియమించినందుకు ఆయన నొచ్చుకున్నారు.

సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ ఆదిమూలం బహిరంగంగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తో తాజాగా జరిగిన భేటీలో ఆయనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దాంతో ఆదిమూలం త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తన కుమారుడితో కలసి లోకేశ్ తో భేటీ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News