Friday, January 24, 2025

బీసీలకు వైఎస్సార్ సీపీలో గుర్తింపు లేదు: పార్థసారథి

- Advertisement -
- Advertisement -

బలహీనవర్గాలకు వైఎస్సార్ సీపీలో గుర్తింపు ఉంటుందని అనుకున్నానని, అది తప్పని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కె. పార్థసారథి అన్నారు. వైఎస్సార్ సీపీలో బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడం నేతి బీరకాయ చందమేనని ఆయన అన్నారు. బీసీలు తమ కాళ్లపై తాము నిలబడాలని అనుకుంటారని, ఇతరుల పెత్తనాన్ని సహిస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకోరని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో తెలియదని పార్థసారథి అన్నారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడం తన అసమర్థత కాబోలని ఆయన అన్నారు.

పార్థసారథి రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News