Monday, December 23, 2024

వైసిపి ఎంఎల్ఎ పద్మావతి సంచలన కామెంట్స్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనకు ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ లేదని, ఎడ్యుకేషన్ మాత్రమే ఉందని ఎంఎల్‌ఎ పద్మావతి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా శింగనమల వైసిపి ఎంఎల్‌ఎ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మాకు ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం తప్పా? అని పద్మావతి ప్రశ్నించారు. వాళ్లనీ, వీళ్లనీ తొక్కేయడం కుతంత్రాలు చేయడం మాకే చేతకాదన్నారు. ఎస్‌సి మహిళ ఎంఎల్‌ఎ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పా?, అందరికీ అణిగిమణిగి ఉండాలా? అని అడిగారు. ఎవరో ఇగో శాటిపై చేయడానికి వాళ్ల కాళ్లు పట్టుకోవాలా? అని దుయ్యబట్టారు. మా నియోజకవర్గానికి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదా? అని ఎంఎల్‌ఎ పద్మావతి ధ్వజమెత్తారు. నీళ్ల కోసం మాట్లాడితే పెద్ద నేరమా? అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News