Tuesday, December 24, 2024

నా ఫోన్‌ను హ్యాక్ చేసి చంపాలని చూస్తున్నారు: వైసిపి ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన ఫోన్‌ను హ్యాక్ చేసి తన చంపాలని చూస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఎ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గత 20 రోజు నుంచి తన సెల్‌ఫోన్‌ను ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ వారు హ్యాక్ చేస్తున్నారని, రూ.50 లక్షల డీల్ కూడా కుదుర్చుకున్నారని, రూ.12.5 లక్షలు రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారని ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్‌కు ప్రొద్దుటూరు ఎంఎల్‌ఎ శివ ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్‌పిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై పెద్ర కుట్ర జరుగుతోందని, రాజకీయంగా దెబ్బతీయడం కోసం తన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇతరుల వ్యక్తిగత వివరాలను తొంగి చూడడం దారుణమన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, బలమైన ఆధారాలతో పోలీస్ శాఖను సంప్రదించానని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News