Monday, December 23, 2024

వైసిపి ఎమ్మెల్సీకి మూడో పెళ్లి చేసిన రెండో భార్య, కుమారుడు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించింది ఎవరో తెలుసా.. ఆయన రెండో భార్య, కుమారుడే.
వీరిద్దరి సమక్షంలోనే జయమంగళ వెంకటరమణ..ఏలూరు జిల్లా కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం సుజాత అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆయన రెండో భార్య సునీత సాక్షి సంతకం కూడా చేశారు.
కాగా,అటవీశాఖ ఏలూరు రేంజ్ లో సెక్షన్ ఆపీసర్ పనిచేస్తున్న సుజాతకు ఇది రెండో పెళ్లి.. ఆమెకు కుమారడు కూడా ఉన్నాడు.

ఇక, మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయిన తర్వాత వెంకటరమణ..కైకలూరుకు చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కొడుకు, కూతురు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం పరస్పరం అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న వెంకటరమణ మూడో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News