Wednesday, January 22, 2025

వైసిపికి ఎమ్మెల్సీ వంశీ రాజీనామా.. జనసేన పార్టీలో చేరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇన్‌చార్జిలు, సిట్ట్‌ంగ్ ఎమ్మెల్యేల మార్పిడి నేపద్యంలో కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకోసం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు.తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్ మాట్లాడుతూ వైసీపీలోని కొన్ని శక్తుల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. వైసీపీ నుంచి మరికొన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News