Sunday, February 2, 2025

వైసిపి ఎంపి కారు ఢీకొని రిటైర్డ్ పశు వైద్యుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ఎంపి మార్గాని భరత్ కారు ఢీకొని రిటైర్డ్ పశు వైద్యుడు (65) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సీతంపేట శివారులో రిటైర్డ్ పశు వైద్యుడు శృంగవృక్షం నర్సయ్య బైక్‌పై రోడ్డు దాటుతుండగా వైసిపి ఎంపి మార్గాని భరత్ కుటుంబానికి చెందిన కారు నలజర్ల వైపు నుంచి విజయవాడకు అతి వేగంగా వెళ్తుండగా అతడి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పశు వైద్యుడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు ఎస్‌ఐ వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎంపి భరత్ లేడని ఎస్‌ఐ పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఒకడు చిల్ అయ్యాడు… పోలీస్ బాస్ ఔట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News