Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా వైసిపి ఎంపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసిపిఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అప్రూవర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన పేరు కూడా ఉంది. గతంలో ఆయనకు ఒకటి , రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణ కు హాజరు కాలేదు. ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఇడి అరెస్ట్ చేసింది. ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఆ తర్వాత ఆయన అప్రూవర్ పిటిషన్ వేశారు. దానికి కోర్టు అంగీకరించింది. ఇప్పుడు మాగుంట కూడా అప్రూవర్ పిటిషన్ వేయడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల ఎంఎల్‌సి కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన బుచ్చిబాబును ప్రశ్నించారు. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పిన వివరాలతో ఇడి దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు తరలింపు వ్యవహారంపై ఇడి కీలక ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తరపున ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటికే ఇడి అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ తరపున అరెస్ట్ అయిన అరబిందో శరత్ చంద్రారెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి క్షమాభిక్ష బెయిల్స్ తెచ్చుకున్నారు. ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయినట్లుగా తెలుస్తోంది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న వైసిపి ఎంపి శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు.

గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ పేరుతో డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్‌ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు లైసెన్స్‌లు పొందినట్లుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ సంస్థలు లిక్కర్ తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చేసినా పిక్సీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32, జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించటం స్కామ్‌లో భాగమని చెబుతున్నారు. మొత్తంగా ఇటీవలి కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కార్ దర్యాప్తు నెమ్మదించింది అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ దూకుడు చూపిస్తూండటంతో కేసు ఏ మలుపులు తిరుగుతుందోనని చర్చనీయాంశంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News