అమరావతి: అనకాపల్లిలో యువకుడిపై వైసిపి ఎంపిపి దాడి చేశారు. లక్ష్మణ్ యాదవ్ అనే యువకుడిపై వైసిపి ఎంపిపి తన అనుచరులతో కలిసి కాలుతో పలుమార్లు తన్నాడు. లక్ష్మణను దూషిస్తూ దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చొప్ప లక్ష్మణ్ తన కుమారుడికి “చంద్రబాబు” అని పేరు పెట్టడంతో 2022లో వైసిపి ఎంపిపి రుత్తల సత్యనారాయణ అనుచరులతో కలిసి అతడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని నగ్నంగా నిలబెట్టి దాడి చేసి వీడియో తీశారు. చంపుతామని, చెల్లిని దొంగ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. ‘పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు మీరు అయిన పట్టించుకోండి’ అని అంటూ ట్విట్టర్ లో మంత్రి లోకేష్ కు బాధితుడు ట్వీట్ చేశాడు. మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసిపి ఎంపిపి సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఓ యువకుడిపై దాడి చేయడం మనేది సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలకు సేవ చేస్తారని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ప్రజలను హింసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పౌరులపై దాడి చేయడానికేనా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేది అని విమర్శలు గుప్పిస్తున్నారు.