Monday, December 23, 2024

వైసిపికి సింగిల్ డిజిటే: డిఎల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చఅసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి సింగిల్ డిజిట్ పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని, రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు ఉంటుందన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు జనవరి 3న ఊహించని మలుపు తిరుగుతోందని డిఎల్ చురకలంటించారు. టీచర్లపై కక్షతో బైజూస్ ప్రవేశ పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో జగన్ వంటి సిఎంను చూడలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక, ఇటుక, మట్టి, మద్యం అన్ని అవినీతిమయంగా మారాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News