అమరావతి: తునిలో మున్సిపల్ కార్యాలయం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టిడిపి, బిజెపి కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం టిడిపి కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసిపి కౌన్సిలర్లు అడ్డుకోవడంతో టిడిపి వాళ్లు నిరసనకు దిగారు. ఎన్నికలు జరగకుండా చేస్తున్నారంటూ వైసిపిపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికకు రాకుండా తమ కౌన్సిలర్లను వైసిపి అడ్డుకుంటున్నారని టిడిపి విమర్శించింది. దీంతో పాటు వైసిపి తీరుపై సొంత పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో కౌన్సిలర్లను వైసిపి అడ్డుకుంటున్నారని బాధను వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తునిలో ఉద్రిక్తత… టిడిపి వర్సెస్ వైసిపి
- Advertisement -
- Advertisement -
- Advertisement -