Sunday, December 22, 2024

ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ భారీ విజయం

- Advertisement -
- Advertisement -

YCP's huge victory in Atmakur by-election

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైసీపీ భారీ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికలో 82,888 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘనవిజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 18,216 ఓట్లు వచ్చాయి. ఇక బిఎస్పీ-4,773, నోటా 3,972 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధించానని తెలిపారు. గౌతమ్ రెడ్డిపై అభిమానంతోనే భారీగా ఓట్లు వచ్చాయన్నారు. దీంతో తనపై బాధ్యత పెరిగిందని చెప్పారు. ఓటమి వల్లే బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News