Friday, December 20, 2024

రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కీ దుకాన్’(ప్రేమ దుకాణం) గురించి ప్రస్తావించారు. కాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం దానిని విమర్శించారు. ‘మీరు ప్రేమ గురించి మాట్లాడేప్పుడు, అందులో సిక్కుల చంపివేత కూడా ఉందా? రాజస్థాన్‌లో మహిళల కిడ్నాపింగ్ గురించి ఉందా? హిందువుల జీవన శైలిని ఖండించడం గురించి ఉందా? భారత దేశాన్ని స్తంభింపజేయాలనుకునే వారితో భాగస్వామ్యం గురించి ఉందా?’ అని ప్రశ్నించారు.

‘మీరు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బహిర్గత జోక్యం కోరుతూ మీరు విదేశాలకు పోవడమా. ఇదెక్కడి ప్రేమ…ఇది దేశానికి సంబంధించింది కాదు, మీ రాజకీయ అధికారానికి సంబంధించింది కాదా?’ అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి. నడ్డా కాంగ్రెస్ నాయకుడిని విమర్శించిన మరునాడే స్మృతి ఇరానీ కూడా రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా వెళ్లి అక్కడ భారతీయులతో మాటామంతీ జరుపుతున్నప్పుడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపిని దుయ్యబట్టారు. జావిట్స్ సెంటర్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘దేశంలో మాకు సమస్య ఉంది, నేను మీకు ఆ సమస్య చెబుతాను. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు భిష్యత్తుపై దృష్టి సారించలేవు, వారికా శక్తి లేదు. వారిని మీరు ఏదైనా అడగండి, గతంలోకి చూస్తారు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News