Monday, December 23, 2024

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఏచూరి ఎన్నిక!

- Advertisement -
- Advertisement -

CPI(M) POLIT BUERO

కన్నూర్: కేరళలోని కన్నూర్‌లో ఆదివారం జరిగిన 23వ పార్టీ కాంగ్రెస్ చివరి రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని వరుసగా మూడోసారి తిరిగి ఎన్నుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకుడు రామ్ చంద్ర డోమ్ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు.  సిపిఐ(ఎం) అత్యున్నత సంస్థలో ఆయన మొదటి దళితుడు కావడం విశేషం.

పార్టీ కేంద్ర కమిటీ , పొలిట్‌బ్యూరో సభ్యులకు 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించడంతో, ఆ వయస్సు పరిమితి కంటే ఎక్కువ వయస్సు ఉన్న నాయకులు మరియు దానికి దగ్గరగా ఉన్న మరికొంత మందిని రెండు సంస్థల నుండి తొలగించారు. కొత్త ముఖాలను పార్టీ నాయకత్వంలోకి తీసుకువచ్చారు. మరో నిర్ణయంలో, పార్టీ కేంద్ర కమిటీ పరిమాణాన్ని 95 నుండి 85 కి తగ్గించారు. కొత్తగా ఏర్పాటైన 17 మంది సభ్యుల పొలిట్‌బ్యూరోలో దళిత ముఖం డోమ్ కాకుండా కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కన్వీనర్ ఎ విజయరాఘవన్, ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే కూడా  ఉన్నారు. వయస్సు కారకంపై పొలిట్ బ్యూరో నుండి తొలగించబడిన వారిలో ఎస్ రామచంద్రన్ పిళ్లై, హన్నన్ మొల్లా,  బిమన్ బసు ఉన్నారు.

85 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీలో ముగ్గురు కొత్తవారు చేరడంతో కేంద్ర కమిటీలో మహిళా ప్రాతినిధ్యం 15కి చేరింది. కేరళ నుంచి కేంద్ర కమిటీకి ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌, మాజీ లోక్‌సభ సభ్యులు పి సతీదేవి, సిఎస్‌ సుజాత ఎన్నికయ్యారు. 2018లో చివరి పార్టీ కాంగ్రెస్ తర్వాత నాలుగేళ్లలో కేరళలో మినహా,  పార్టీ సభ్యత్వం పతనాన్నినిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన సంస్థాగత నివేదికను ఆదివారం పార్టీ కాంగ్రెస్ ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News