Sunday, December 22, 2024

సీఐడీ విచారణకు యడియూరప్ప హాజరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సిఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సోమవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో గత ఏప్రిల్‌లో యడియూరప్పను కార్యాలయానికి పిలిపించిన సీఐడీ అధికారులు వాయిస్ శాంపిల్స్ సేకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి యడియూరప్ప సీఐడీ ముందు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఈ కేసులో యడియూరప్పను తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించడంతో యడియూరప్పకు ఊరట లభించినట్టయింది. మరోవైపు యడియూరప్పపై పోక్సో కేసు నమోదై మూడు నెలలు దాటినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని బాధితురాలి సోదరుడు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News