Wednesday, January 22, 2025

పోక్సో కేసులో ఎడియూరప్పకు ఊరట

- Advertisement -
- Advertisement -

తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జులై 26వ తేదీకి వాయిదా వేసిన కర్నాటక హైకోర్టు జులై 15న బెంగళూరు కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. జులై 15న తమ ఎదుట హాజరు కావాలని 81 సంవత్సరాల ఎడియూరప్పను ఆదేశిస్తూ

పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులపై విచారణ జరిపే ఫాస్ట్ ట్రాక్ కోర్టు జులై 4న సమన్లు జారీచేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూన్ 27న ఎడియూరప్పపై చార్జిషీట్ దాఖలు చేసింది. తన 17 ఏళ్ల కుమార్తెపై ఎడియూరప్ప ఈ ఏడాది ఫిబ్రవరి 2న డాలర్ల కాలనీలోని తన ఇంట్లో లైంగిక దాడి జరిపినట్లు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News