Monday, December 23, 2024

ఈశ్వరప్ప మరక తొలిగి వెలుగుతాడు

- Advertisement -
- Advertisement -

Yediyurappa Gives Clean Chit To Eshwarappa

స్నేహితుడు యడ్యూరప్ప ఆశాభావం

శివమొగ్గ : తన పాత స్నేహితుడు ఈశ్వరప్పపై వచ్చిన ఆరోపణలు అన్నికొట్టుకుపోయి ఆయన నిజాయితీ వెలుగులోకి వస్తుందని కర్నాటక మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓ కాంట్రాక్టరు ఆత్మహత్య వివాదంలో కీలక వ్యక్తిగా మంత్రి ఈశ్వరప్ప పేరు బయటకు వచ్చింది. దీనితో ఆయన రాజీనామా సమర్పించారు. ఈ విమర్శలు ఫిర్యాదుల నుంచి త్వరలోనే ఆయన విముక్తుడు అవుతారని, తిరిగి రాష్ట్ర మంత్రిగా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పతో తన స్నేహం పురాతనమైనది. ఆయన నైజం ఏమిటనేది తనకు తెలుసునని నిర్దోషిగా తిరిగి వెలుగొందుతాడని స్పష్టం చేశారు. కాంట్రాక్టరు సంతోష్ పాటిల్ బలవన్మరణ ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు మంత్రిపై కేసు దాఖలు చేశారు. దీనితో ఈ అవినీతి ఆరోపణల ఘట్టం మంత్రిపదవికి గండం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News