Sunday, January 19, 2025

మండల కేంద్రంగా ఏదుల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఏదుల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మండలకేంద్రంగా ఏదుల ఏర్పాటు చేయటం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

రేవల్లి మండలం చెన్నారం, చీర్కపల్లి, గోపాల్ పేట మండలం ఏదుల, కోడేరు మండలం సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లిలతో కలిపి మండలం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండల కేంద్రం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదరు చూస్తు వచ్చిన ఏదుల వాసుల కల నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News