Thursday, January 23, 2025

పాలమూరు రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ

- Advertisement -
- Advertisement -

వనపర్తి : పాలమూరు రంగారెడ్డి లో ఏదుల పంప్ హౌస్ డ్రై రన్‌కు సిద్ధమవుతున్నట్లు నీటి పారుదల శాఖ సిఈ హమీద్ ఖాన్ శుక్రవారం వెల్లడించారు. ముఖమంత్రి కెసిఆర్ ఆ దేశాల మేరకు ఇటీవల ఏదుల పంపింగ్ స్టేషన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యదర్శి స్మిత సబర్వాల్ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ సిఈ హమీద్ ఖాన్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైందని, ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సిఎం సెక్రటరీ స్మిత సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్‌ను సందర్శించి జులై 6 నాటికి నీరందించేలా పంపులు సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.

దీ ంట్లో భాగంగా శుక్రవారం ఏదుల పంపింగ్ స్టేషన్ దగ్గర నిర్మించిన 400కెవి సబ్ స్టేషన్‌ను ఛార్జ్ చేయడం జరిగిందని, దీంతో పాటు 400 కెవి సబ్ స్టేషన్ నుంచి ఏదుల పంపింగ్ స్టేషన్ వరకు నిర్మించిన 60 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా చార్జ్ చేయడం జరిగిందన్నారు. దీంతో ఏదుల పంపింగ్ స్టేషన్ పంపులను నడపడానికి మార్గం సుగ మం అయ్యింది. ఈ నేపథ్యంలో త్వరలో ఏదుల పంప్ హౌస్‌ల డ్రై రన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోన్‌లో ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఈ శ్రీరాం నాయక్, సిఈ లతా వినోద్, ఎస్‌ఈలు విజయ భాస్కర్ రెడ్డి, మానిక్య రావు, ఈఈలు రాము, రవీందర మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, డిఈలు సత్యనారాయణ రావు, దశరథ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News