Thursday, January 23, 2025

కామారెడ్డిలో బాలికపై అత్యాచారం…. ఆ రాజకీయ నాయకుడిపై ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్‌లో శుక్రవారం 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జగన్ గౌడ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తన ఇటుక బట్టి కేంద్రంలో పనికి వచ్చిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జగన్ గౌడ్‌పై పోక్సో, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలంటూ ఓ పార్టీకి చెందిన నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. జగన్ గౌడ్ తన రాజకీయ పలుకుబడితో తనని బెదిరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నట్టు సమాచారం.

Also Read: కన్న బిడ్డలను చూసేందుకు వస్తే భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News