Sunday, December 22, 2024

ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Yellammagudem Sarpanch husband brutally murdered

తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త విజయ్ రెడ్డిగా గుర్తించారు. బైకుపై వెళ్తుండగా కారుతో అడ్డగించి దుండగులు కత్తులతో దాడిచేసి చంపారు. అనంతరం విజయ్ రెడ్డి  మృతదేహాన్ని కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.  పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News