Wednesday, January 22, 2025

ఇల్లందు లో కాంగ్రెస్ హ్యట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

ఇల్లందు: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫలితాల కౌంటింగ్‌లో ఇల్లందు నియోజకవర్గంలో ముచ్చటగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి హ్యట్రిక్ సాధించి కంచుకోటగా మారింది. కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధి కోరం కనకయ్య సమీప బిఆర్‌ఎస్ అభ్యర్ధి బానోత్ హరిప్రియానాయక్‌పై అత్యధిక మెజార్టీ 56898ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఇప్పటికి వరకు నియోజకవర్గంలో అంత మెజార్టీ వచ్చిన ఎకైక వ్యక్తిగా కోరం కనకయ్య నిలిచారు. ఉదయం 8గంటలకు జిల్లా కేంద్రంలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదలైన ఎన్నికల కౌంటింగ్‌లో నియోజకవర్గం 111 స్ధానం నుండి 18రౌండ్లలో మొదటి నుండి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,74,904 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనకయ్యకు ఇవిఎమ్‌లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపి 108316 ఓట్లతో మొదటిస్ధానంలో నిలిచారు, రెండవ స్ధానంలో వున్న బిఆర్‌ఎస్ అభ్యర్ధి బానోత్ హరిప్రియాకు 51418ఓట్లు రాగా,

మూడవస్ధానంలో బిజేపి అభ్యర్ధి ధారవత్ రవీంద్రనాయక్‌కు 2519 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా నోటాకు 1400 ఓట్లు పోల్ కాగా మిగతా అభ్యర్ధులకు డిపాజిట్‌లు దక్కలేదు. కౌంటింగ్‌లోని అన్నిరౌండ్లలలో కోరంకు మెజార్టీ రావడంతో బిఆర్‌ఎస్ అభ్యర్ధి హరిప్రియా కౌంటింగ్ కేంద్రం నుండి పూర్తి ఫలితాలు వెలువడవకు ముందే నిరాశతో వెను దిరిగారు. కేంద్రం వద్ద కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున్న గుమిగూడి కోరం కనకయ్య నాయకత్వం వర్ధిలాల్లి అంటు నినాదాలు చేసి బాణాసంచా కాల్చి రంగులు పులుముకున్నారు.మార్పు కోరుకున్న ప్రజలుః నియోజకవర్గంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌లో గెలిచిన అభ్యర్ధులు అభివృద్ధి పేరుతో పార్టీ మారి పదేళ్ళపాటు బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో వున్నప్పటికిని ఉహకందని స్ధితిలో ప్రజల్లో పూర్తిగా ప్రభుత్వంపై విసిగిపోయినట్లుగా మార్పు కోరుతూ భారీ మెజార్టీని కాంగ్రెస్‌కు కట్టబెట్టి బిఆర్‌ఎస్‌ను ఇంటిబాట పట్టించారు. తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగన పరిణామాల దృష్ట రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రేస్ పార్టీని అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో గెలిపించడంతో ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి.

డబుల్ ఇంజన్ సర్కారు రాబోతుందని ఇల్లందు జేకే కాలనీలోని కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంతో పాటు పట్టణంలోని పలు కూడళ్ళలో కాంగ్రేస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు స్వీట్లు పంచుతూ కాంగ్రెస్ జెండాలను ఎగరవేస్తూ సంబరాలు ఘనంగా చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News