Wednesday, January 22, 2025

కెటిఆర్ వద్దకు ఇల్లందు పంచాయితీ

- Advertisement -
- Advertisement -

అభ్యర్థి హరిప్రియ విజయం కోసం పనిచేయాలని హితవు
ఏమైనా సమస్యలుంటే నేను చూసుకుంటా పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సెగ్మెంట్‌లోని బిఆర్ఎస్ పార్టీ పంచాయితీ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె. తారకరామారావు వద్దకు వెళ్ళింది. ఇల్లెందు బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి బానోతు హరిప్రియ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డి.వెంకటేశ్వర్‌రావు,బయ్యారానికి చెందిన మూల మధుకర్‌రెడ్డి ఇతర మండల నాయకులు గత కొ న్ని రోజుల నుంచి అభ్యర్ధికి వ్యతిరేకంగా మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్మన్ మధ్యతీవ్ర స్ధాయిలో విభేదాలు పొడచూపాయి. ఇల్లెందు సెగ్మెంట్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు ఇరువురి మధ్య రాజీ కుదిరిచేందుకు ఇరువురితో ఒక ధపా చర్చలుజరిపారు.

ఏకంగా మున్సిపల్ చైర్మన్ డివి నివాస గృహానికి వెళ్ళి ఆయనతో చర్చలు జ రిపి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే హరిప్రియ, డి.వి ఇతరులను సమావేశ పరిచి చర్చలు జరిపారు. ఆలోచించి చెబుతామని ఆ సమావేశంలో డివి వర్గం ప్రకటించింది. వరంగల్ జిల్లాకు విచ్చేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దృష్టికి కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్ళారు. అయినప్పటికి డివివర్గం దిగిరాకపోవడంతో గురు వారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మహబుబ్‌బాద్ ఎంపి మాలోతు కవిత ప్రత్యేక చొరవ తీసుకొని ప్రగతి భవనంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి ఇల్లెందు సమస్యను తీసుకెళ్ళారు.

ఇరువర్గాలతో మంత్రి సుదీర్ఘంగా వేర్వేరుగా చర్చలు జరిపిన తరువాత అందరూ కలిసిపని చేయండి ఎమ్మెల్యేగా బానోతు హరిప్రియను గెలిపించుకోని రండి ఆ తరువాత మీ సమస్యలన్నింటిని పరిష్కరించే బాధ్యత నాది’ అని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అసమ్మతి వర్గం తీసుకేళ్ళిన కొన్ని సమస్యలను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఇంకా ఏమైనా ఉంటే తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అసలు ఇల్లెందులో ఏం జరుగుతుంది అని కెటిఆర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు. రాజకీయ సమీకరణలు, ప్రస్తుత పరిస్థితు ల ఇతరకారణా వల్లనే హరిప్రియా అభ్యర్ధిత్వాన్ని ఖారారు చేయాల్సి వచ్చిందని ముందుగా మీరం తా అభ్యర్ధి విజయం కోసం ఐక్యమత్యంతో కలిసి పనిచేయాలని మంత్రి కెటిఆర్ వారికి సూచించా రు. మంత్రి కెటిఆర్ వద్ద జరిగిన ఈ సమావేశంలో మహబుబ్ బాద్ ఎంపి మాలోతు కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మున్సిపల్ చైర్మన్ డి.వెంకటేశ్వర్ రావు(డి.వి), మూల మధుకర్‌రెడ్డి ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News