- Advertisement -
హైదరాబాద్: భారత వాతావరణ శాఖ, హైదరాబాద్(ఐఎండి-హెచ్) నగరంలో వివిధ ప్రాంతాల్లో శనివారం కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నేటి నుంచి సెప్టెంబర్ 3 వరకు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
సెప్టెంబర్ 1న తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లా, నాగర్ కర్నూల్ లో సాధారణ భారీ వర్షంకు మించి అత్యంత భారీ వర్షం పడొచ్చని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి లలో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -