Sunday, December 22, 2024

అల్పపీడనం.. తెలంగాణకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏ ర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24గంటల్లో వాయువ్య ,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది బలపడి పశ్చిమ వాయువ్య దిశ గా కదులుతూ దక్షిణ ఒడిశా ,ఏపిలోని ఉత్తరాంధ్ర జిల్లాల తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం మరొక ఆవర్తనం బంగాళఖాతంలోని మధ్య భాగం పరిసరాల్లోని ఉత్తర బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వరకూ సముద్రమట్టానికి 4.5నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాం తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాగల మూడు రోజులు ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు ,ఈశాన్య తెలంగాణ జిల్లాలలోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

రాగల 24గంటల్లో తెలంగాణలోని కరీంనగర్ ,పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు ,మెరుపులతో కూడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

పేరూర్‌లో 69.2.మి.మి వర్షం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పా టి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.అత్యధికంగా ములుగు జిల్లా పేరూర్‌లో 69.2 మి.మి వర్షం కురిసింది. రంజల్‌లో 30, బోధన్‌లో 23.2, ఎడపల్లిలో 20, నిజామాబాద్‌లో 19.2, పెడ్డెముల్‌లో 19.2, బెజ్జూర్‌లో 17.2, వెం కటాపురంలో 9.8, బూర్గంపహడ్‌లో 9.2 మి.మి వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News