Monday, December 23, 2024

అకాల వర్షాలు ..16 జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

వైఖాఖమాసం ప్రారంభమైంది. మండు వేసవిలొ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాగల 24గంటల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు ,మెరుపులు ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ కొనసాగిన ద్రోణి గురువారం మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమై ఉపరితల ఆవర్తనంగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మి ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో కింది స్థాయిలో గాలులు దక్షిణ , ఆగ్నేయ దిశలనుంచి వీస్తున్నాయి.

శుక్ర , శని వారాలలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుతోపాటు గంటకు 30నుంచి 40 కి.మి వేగంతో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.శుక్రవారం రాష్టంలో నిర్మల్ , నిజామాబాద్, వరంగల్ , హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్ , సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి , మహబూబ్ నగర్ , నాగర్‌కర్నూల్ , వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం బూర్గంపహడ్‌లో గరిష్టంగా 62మి.మి వర్షం కురిసింది. గోవిందారంలో 45, సీతారామపురంలో 44.5, భద్రాచలంలో 30.3, వేలేర్‌లో 27 రాజోలిలో 24 మి.మి చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉష్ణగ్రతలు కూడా గరిష్టంగా నిజామాబాద్ జిల్లా జోకారాలో 43.6, సాలూరాలో 43, బెల్లాల్‌లో 42. 4డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News