Tuesday, November 5, 2024

కృష్ణా జలాలపై తొలి విజయం

- Advertisement -
- Advertisement -

కృష్ణానదీ జలాలపై తెలంగాణ రాష్ట్రం తొలివిజయం సాధించింది. నీళ్లు నిధు లు నియమాకాలే ఉద్యమ ఊపిరిగా పోరాట చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొలిముఖ్యమంత్రిగా సారధ్య బాధ్యతలు చేపట్టిన సిఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన మరో పోరాటం ఫలించింది. పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తుల ద్వారా, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల ద్వారా తెలంగా ణ సాగు నీటి అవసరాలపై గళమెత్తి సమాన వాటా సాధనే లక్షంగా చే స్తూ వచ్చిన ఉద్యమ స్ఫూర్తికి కేంద్రం తలొగ్గింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కేం ద్ర మంత్రి వర్గవర్గ సమావేశంలో మంత్రి మండలి ష్ణానదీ జలాల వివాదంపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల మధ్య కృష్ణానదీ సమస్యను త్వరగా పరిష్కరించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు సూచించింది. రెండు రాష్ట్రాల మధ్య ఈ సమస్య పరిష్కారానికి కూడా విధివిధానాలు రూపొందించాలని కోరింది.

దీంతో తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం కోరిక నేరవేరే అడుగులు పడ్డాయి. ప్రభుత్వం 1956 అంతర్ రాష్ట్ర నదీ లాల వివాదాల చట్టంలోని 3వసెక్షన్ ప్రకారం కృష్ణానదీ జలాలను తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయమని సిఎం కెసిఆర్ పదే పదే కోరుతూ వచ్చారు. కేంద్రం బదులుగా రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89ప్రకారం విచారణకు అదేశించింది. ఈ విచారణ వల్ల తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సిఎం ముందే గ్రహించారు. అందుకే ఆయన నిరంతరాయంగా సెక్షన్ 3 ప్రకారం నదీజలాల పున పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ విచారణ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరుతూ వచ్చారు. 2020లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై పట్టుబట్టారు. కెసిఆర్ ఒత్తిడి మేరకు తలొగ్గిన కేంద్రమంత్రి సుప్రీంలో ఉన్న కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయడానికి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ కేసును విరమించుకుంది. ఆ తర్వాత మూడేళ్లకు కేందం తాజాగా బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

575 టిఎంసిలపైనే తెలంగాణ ఉడుంపట్టు!
కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధంగా 575టిఎంసిలు కేటాయించాల్సిందేనని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉడుంపట్ట పట్టింది. తొమ్మిదేళ్లు గడిచినా ఈ పట్టు ఏమాత్రం సడలకుండా కాపాడుకుంటూ వస్తోంది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ నదీజలాలను అధ్యయనం చేసి 75శాతం నమ్మకమైన నీటి 2130 టిఎంసిలు లభిస్తాయని లెక్కతేల్చింది. ఈ నీటిని ఎగువన మహారాష్ట్రకు 585 టిఎంసిలు, కర్నాటకకు 734 టిఎంసిలు ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టిఎంసిలు కేటాయించింది. ట్రిబ్యునల్ కాలపరిమితి 2000తో ముగిసిపోయింది. నదీలో నీటి లభ్యతను బట్టి కేటాయింపులు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి ఎపికి కేటాయించిన 811టిఎంసిల నీటిలో తెలంగాణ ప్రాంతానికి 34శాతంగా 299 టిఎంసిలు , ఆంధ్రా ,రాయలసీమ ప్రాంతాలకు కలిపి 66శాతం వాటాగా 512 టిఎంసిలు వినియోగించుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2004లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ నదీలో 65శాతం నమ్మకమైన నీటి లభ్యతగా 2582 టిఎంసిలు ఉన్నట్టు లెక్కతేల్చింది.

ఈ నీటిలో మహారాష్ట్రకు 666 టిఎంసిలు, కర్ణాటకకు 911 టిఎంసిలు , ఉమ్మడి ఎపికి 1001 టిఎంసిలు కేటాయించింది. 2011లో తీర్పును వెలవరించింది. ఈ తీర్పు ఉమ్మడి ఎపికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అభ్యంతరం చెబుతూ అప్పటి ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా గెజిట్ నోటిఫికేషన్ అమలు కాకుండా బ్రిజేష్ తీర్పును అడ్డుకుంది. ఆ తర్వాత 2014లో ఉమ్మడి ఏపినుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సిఎం కెసిఆర్ నదీజలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను చక్కదిద్దడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అంతకు ముందున్న మహారాష్ట, కర్ణాటక , ఎపితో పాటు కొత్తరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను కూడా ట్రిబ్యునల్‌లో చేర్చి నీటి పునః పంపిణీ ద్వారా రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య 811టిఎంసిల నీటిలో 66:34శాతం మేరకు వినియోగించుకునేందుకు ఒక ఏడాది కాలాని తాత్కాలికంగా ప్రాతిపదికగా అపెక్స్ కౌన్సిల్‌లో అంగీకరించారు.

అయితే ఆ తర్వాత కూడా అదే విధానం కొనసాగుతోంది. దీన్ని పలు మార్లు కృష్టా బోర్డులో తెలంగాణ వ్యతిరేకించింది. సమాన వాటాగా 405.5 టిఎంసిలను వాడుకుందామని ప్రతిపాదిస్తూ వచ్చింది. అది కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకే అని స్పష్టం చేస్తూ వచ్చింది. న్యాయపరంగా తెలంగాణకు 575 టిఎంసిల కేంద్రం మీద న్యాయస్థానాల ద్వారా పోరాడుతూనే వస్తోంది. ఎట్టకేలకు బుధవారం నాటి కేంద్ర మంత్రి నిర్ణయంతో తొలి విజయం సాధించినట్టయింది.
విధి విధానాలపై త్వరలో స్పష్టత :
కేంద్ర మంత్రిమండలి కృష్ణానదీ జలాల పునఃపంపిణీ పట్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఇచ్చి విధివిధాలపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ, ఎపి రాష్ట్రాల నీటి పారుదల శాఖల అధికారులు ఈ కేంద్రం వెల్లడించాల్సిన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణకు పసుపుబోర్డు ..గిరిజన వర్శిటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి బుధవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ప్రధానంగా తెలంగాణకు సంబంధించివే. తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు, తెలంగాణలోని ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రి మండలి సమ్మతి తెలిపింది. తెలంగాణలో గిరిజనులకు ఉన్నత విద్యకోసం ఉద్ధేశించిన ఈ విద్యాలయానికి రూ 889.07 కోట్ల వ్యయ అంచనా వేశారు. కేంద్ర కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌లు మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News