Tuesday, September 17, 2024

మరో అల్పపీడనం..5రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నాటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నాడు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతిదిశగా వంగి ఉందని, రాబోయే రెండురోజుల్లో ఉత్తర దిశగా వైపు కదులుతుందని తెలిపింది. రుతుపవన ద్రోణి సూరత్‌గఢ్, రోహ్‌తక్, ఒరై, మండ్లా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలోని అల్పపీడన కేంద్రం నుంచి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

కొత్తపల్లిలో 46.5మి.మి వర్షం:
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. నారాయణపేట్ జిల్లా కొత్తపల్లిలో అత్యధికంగా 46.5మి.మి వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా కొండమల్లపల్లిలో 30.5, మహబూబ్‌నగర్‌లో 29, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 25.5, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 25.3, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 24.5మి.మి చొప్పున వర్షం కురిసింది.గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా పలు చొట్ల వర్షం కురిసింది. వివేకానందనగర్ ,బేటంపేట, అమీర్‌పేట , పంజాగుట్ట , ఖరాతాబాద్‌తోపాటు పలు చొట్ల వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News