Monday, December 23, 2024

ఎర్ర సముద్రంలో ఒక నౌకపై హూతీ రెబెల్స్ దాడి

- Advertisement -
- Advertisement -

యెమెన్ హూతీ రెబెల్స్ సోమవారం ఎర్ర సముద్రంలో ఒక నౌకపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల క్రితంఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి హూతీ రెబెల్స్ దాడి జరుగుతున్న కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గానికి భద్రత కల్పనకు కొత్త యుఎస్ విమానవాహక నౌక ఆ ప్రాంతాన్ని సమీపిస్తున్న సమయంలో ఆ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యెమెన్ అల్ హుదయ్‌దాహ్ తీరం సమీపంలో సిబ్బందితో ఉన్నవి రెండు, సిబ్బంది లేనిది ఒకటి& మూడు చిన్న పడవలు దాడి జరుపుతున్నట్లు నౌక కెప్టెన్ తెలియజేసినట్లు

బ్రిటిష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ సాగర ప్రాంత వాణిజ్య కార్యకలాపాల (యుకెఎంటిఒ) కేంద్రం వెల్లడించింది. నౌక ఆత్మ రక్షణ చర్యలు నిర్వహించిందని, 15 నిమిషాల తరువాత చిన్న పడవ దాడిని నిలిపివేసిందని యుకెఎంటిఒ తెలిపింది. ఆ తరువాత 45 నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు క్షిపణి దాడులు జరిగినట్లు, అవి నౌకకు దగ్గరలో పేలిపోయినట్లు కెప్టెన్ తెలియజేశాడు. నౌక పేరు, ఏ దేశం జెండానో వెల్లడించలేదని, సిబ్బంది అంతాక్షేమంగా ఉన్నారని యుకెఎంటిఒ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News