Wednesday, January 22, 2025

యుఎస్ యుద్ధనౌకపై దాడి చేశాం :యెమెన్ హౌతీ రెబెల్స్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : సముద్రంలో సోమవారం ఒక అమెరికన్ నేవీ మొబైల్ బేస్‌పై తాము దాడి జరిపామని, కానీ సాక్షాధారాలు ఇవ్వలేమని యెమన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ వెల్లడించారు. అయితే, ఆ సమాచారాన్ని అమెరికన్ రక్షణ శాఖ అధికారి ఒకరు వెంటనే తిరస్కరించారు. సముద్రంలో తేలియాడే స్థావరంగా యుఎస్‌ఎస్ లూయిస్ బి పుల్లర్ నౌక లక్షంగా ఆ దాడి జరిగింది. ఎర్ర సముద్రం, ఏడెన్ సింధుశాఖ మీదుగా సాగే వాణిజ్య సరకుల నౌకలపై హౌతీ దాడులను కట్టడి చేసేందుకు అమెరికన్ యత్నాల్లో భాగంగా పుల్లర్‌ను అంతకుముందు అరేబియా సముద్రంలో నిలిపి ఉంచారు.

ఏడెన్ సింధుశాఖలో పుల్లర్‌పై తాము ఒక క్షిపణిని ప్రయోగించినట్లు హౌతీ మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియన్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో తెలియజేశారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి సరీ నిరాకరించారు. ‘గాజా స్ట్రిప్‌లో పోరు నిలిచిపోయేంత వరకు, పాలస్లీనా ప్రజలపై నిర్బంధం ఉపసంహరించేంత వరకు’ హౌతీ దాడులు కొనసాగుతాయని సరీ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, పుల్లర్‌పై దాడి జరిగినట్లు సమాచారం లేదు అని నిఘా వ్యవహారాలపై చర్చకు తన పేరు వెల్లడించరాదన్న షరతుపై అమెరికన్ రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News