Monday, December 23, 2024

శత్రు హౌతీ క్షిపణి చిత్తుచిత్తు..

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ ఇప్పుడు అత్యంత అధునాతన ఆయుధ పాటవాన్ని గాజా యుద్ధం నేపథ్యంలోనే పరీక్షించుకొంటోంది. తాము రూపొందించిన అత్యంత అధునాతనమైన ఆరో 3 క్షిపణి నిరోధక అస్త్రాన్ని తాము ఇరాన్ మద్దతున్న హౌతీ రెబెల్స్ క్షిపణిని తిప్పికొట్టేందుకు వాడామని ఇజ్రాయెల్ ప్రకటించింది. సైన్యం వాడకానికి దీనిని రంగంలోకి దింపిన తరువాత తొలిసారిగా హౌతీ దాడిని తప్పికొట్టేందుకు వాడారు. ఎర్ర సముద్రం మీదుగా తమ భూభాగం వైపు దూసుకువస్తున్న హౌతీ క్షిపణిని తిప్పికొట్టి తుత్తునియలు చేశామని సైనిక అధికార వర్గాలు శనివారం నిర్థారించాయి. తమకు హమాస్ నుంచే కాకుండా యెమెన్ ఇతర కొన్ని దేశాల నుంచి తీవ్రస్థాయి ముప్పు ఉందని, దీనిని తట్టుకునేందుకు తాము తమ శక్తిని ఈ విధంగా వాడుకుంటామని ఇజ్రాయెల్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News