హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్(62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ్లూరి సుధాకర్ మృతితో తెలుగు సాహిత్య ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ సంతాపం తెలిపారు. సాహిత్యలోకం నుంచి “కొత్త గబ్బిలం” నిష్క్రమించినా ఆయన రచనలు ఎప్పటికీ వర్తమానమే “వర్గీకరణియ గోసంగి” కవి “అటజనకాంచెగా” సాహిత్య వెలుగులు వెదజల్లుతూనే ఉంటారు. తెలుగు సాహిత్యానికి ఇష్టమైన గొప్పకవిని సాహిత్య రంగం కోల్పోయిందన్నారు. ఎండ్లూరి సుధాకర్‌ది మూల సంస్కృతి కలం. కుల అధిపత్యాల మీద విరుచుకపడ్డ ఆయన పాదముద్రలు చెరిగిపోనివి. ఎండ్లూరి రచనలకు మరణం లేదని జూలురీ గౌరీ శంకర్ తెలిపాడు. ఆయన 1959 జనవరి 20 నిజామాబాద్ జిల్లాలోని పాముల బస్తీలో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి పుణ్య దంపతులకు తొలి సంతానం. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడిగా సేవలందించారు.
రచనలు:
పుస్తకం | ప్రక్రియ | ప్రచురణ | సంవత్సరం |
---|---|---|---|
1.వర్తమానం | కవితలు | మానస ప్రచురణలు,రాజమండ్రి | జూలై 1992, జనవరి 1995 |
2.జాషువా’ నాకథ ‘ | ఎం.ఫిల్ పరిశోధన | మానస ప్రచురణలు,రాజమండ్రి | జూలై 1992 |
3.కొత్త గబ్బిలం | దళిత దీర్ఘ కావ్యం | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | సెప్టెంబరు 1998, సెప్టెంబరు 2011 |
4.నా అక్షరమే నా ఆయుధం | డా .శరణ్ కుమార్ లింబాలే ఆత్మ కథకి అనువాదం | …………. | 1999,సెప్టెంబరు |
5.మల్లె మొగ్గల గొడుగు | మాదిగ కథలు | దండోరా ప్రచురణలు,హైదరాబాదు | అక్టోబరు 1999 |
6.నల్లద్రాక్ష పందిరి (DARKY) | ఉభయ భాషా కవిత్వం | జె .జె ప్రచురణలు,హైదరాబాదు | జూన్ 2002 |
7.పుష్కర కవితలు | కవితలు | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | 2003 |
8.వర్గీకరణీయం | దళిత దీర్ఘ కావ్యం | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | బ్లాక్ డే, డిసెంబరు 2004, గుడ్ ఫ్రైడే మార్చి 2005 |
9.”ఆటా “జనికాంచె… | అమెరికా యాత్రా కవితలు | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | జూన్ 2006 |
10.జాషువా సాహిత్యం- దృక్పథం – పరిణామం | పిహెచ్. డి సిద్ధాంత గ్రంథం 1993 | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | ఏప్రిల్ 2007 |
11.గోసంగి | దళిత దీర్ఘ కావ్యం | అంబేద్కర్ సాహితీ విభాగం, బొబ్బిలి, విజయనగరం జిల్లా | మే 2011 |
12.కథానాయకుడు జాషువా | జీవిత చరిత్ర | తెలుగు అకాడమి,హైదరాబాదు | 2012 |
13.నవయుగ కవి చక్రవర్తి జాషువా | మోనో గ్రాఫ్ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు అకాడమి,హైదరాబాదు | నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబరు 27, 27, 28 2012 |
14.కావ్యత్రయం | దీర్ఘ కావ్య సంకలనమ్ | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | |
15.సాహితీ సుధ | దళిత సాహిత్య వ్యాసాలు | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | 9,నవంబరు,2016 |
16.తెలివెన్నెల | సాహిత్య వ్యాసాలు | మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . | 21-1-2017 |