Monday, January 20, 2025

ప్రేమజంట… రైలు నుంచి కిందపడిన భార్య…. పట్టుకోబోయి భర్త మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: రైలు నుంచి భార్య పడుతుండగా పట్టుకోబోయి భర్త మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సయ్యద్ ఆసిఫ్- ఆసియాబా అనే దంపతులు గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నారు. ఇద్దరు ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఎర్రగుంట్లకు రాగానే భార్య అసియాబా నిద్ర మత్తులో రైళ్లో నుంచి కిందపడిపోయింది. వెంటనే భార్య కోసం భర్త రైళ్లో నుంచి దూకాడు. ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. భార్యను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ దంపతులు కర్నాటకలోని ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరు నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News