Saturday, December 28, 2024

వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న యెస్ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

 

Yes Bank

ముంబై: యెస్ బ్యాంక్ బోర్డు జూలై 29న జరిగే సమావేశంలో వాటా విక్రయం ద్వారా నిధులను సేకరించే ప్రణాళికను పరిశీలిస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం, పెట్టుబడికి సంబంధించి  పిఈ ఆటగాళ్ల (ప్రైయివేట్ ఈక్విటి ప్లేర్స్) ప్రతిపాదనలను రుణదాత పరిగణించవచ్చు. ఫండింగ్ ప్రతిపాదనలో భాగంగా కార్లైల్,  అడ్వెంట్ చెరో 10% వాటాను, బోర్డులో నామినేషన్‌ను పొందాలని చూస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై వ్యాఖ్యానించడానికి సంబంధిత పార్టీలన్నీ నిరాకరించాయి. గత నెలలో డీల్ ఊహాగానాలతో షేరు ధర దాదాపు 20 శాతం పెరిగి, బ్యాంకింగ్ ఇండెక్స్ , సెన్సెక్స్‌ను అధిగమించింది. ఈ వారం ప్రారంభంలో, రుణదాత(యెస్ బ్యాంక్) యొక్క మేనేజింగ్ డైరెక్టర్ & CEO పశాంత్ కుమార్ ‘మనీకంట్రోల్‌’తో మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ “ఖచ్చితంగా” 1 బిలియన్‌ డాలర్లను సమీకరించనుందని చెప్పారు. మూలధన సమీకరణ సమయం బ్యాంకు రుణ వృద్ధి లక్ష్యాన్ని ప్రభావితం చేయదన్నారు.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం రూ. 311 కోట్లు ,  ఏడాది ప్రాతిపదికన(YoY)  50 శాతం  పెరిగింది. జూలై 15 నుండి అమలులోకి వచ్చేలా వాటాదారుల ఆమోదంతో యెస్ బ్యాంక్ కొత్త బోర్డును ఖరారు చేసింది. భారత రిజర్వు బ్యాంకు ఆమోదానికి లోబడి ఎండి , సిఈవో ప్రశాంత్ కుమార్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించాలని కొత్త బోర్డు సిఫార్సు చేసింది. బోర్డులో ఇప్పుడు ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఇద్దరు అస్వతంత్ర డైరెక్టర్లు,  MD , CEO ఉన్నారు. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీని  బోర్డులో అదనపు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడాన్ని కూడా రుణదాత(లెండర్) ఆమోదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News